బ్యారేజ్‌ని ఢీకొట్టిన బోట్లు వారివే- జగన్ కుట్ర బట్టబయలైంది : కొల్లు రవీంద్ర - Minister Kollu Exclusive Interview
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 10, 2024, 3:59 PM IST
Minister Kollu Ravindra Exclusive Interview On Boat Crash : ప్రకాశం బ్యారేజిని బోట్లు ఢీ కొన్న ఘటనపై గనుల శాఖ విచారణ చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బ్యారేజ్‌ని ఢీ కొన్న బోట్లు ఇసుక అక్రమ మైనింగ్‌కు వినియోగించినట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. కృష్ణానదికి ఎప్పుడూ రాని వరద వచ్చింది. అటువంటి సమయంలో వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ వైఎస్సార్సీపీ విష ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్యారేజీని ఢీ కొన్నబోట్ల వల్ల అతి బలమైన దాదాపు 15, 20 టన్నుల బ్యాలెన్సింగ్ రాడ్ విరిగిపోయింది. అదే బ్యారేజీకి కొట్టినట్టైతే పరిస్థితులు మరింత దారుణంగా మారేవని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. లక్షలాది మంది జలసమాధి అయ్యేలా సైకో జగన్ పన్నిన కుట్ర బట్టబయలైందన్నారు. ఒకే రకమైన మూడు పడవలు కావడం, వైఎస్సార్సీపీ నాయకుల దగ్గరి వ్యక్తుల పడవలు కావడం అనుమానాలకు తావిస్తుందని మంత్రి అన్నారు. కుట్ర వెనుక ఎంతటి వారు ఉన్నా ఉపేక్షించేది లేదంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో ఈటీవి ముఖాముఖి.