ETV Bharat / entertainment

ప్రభాస్ హను రాఘవపూడి సినిమా షూటింగ్ అప్డేట్​! - ఎప్పుడు, ఎక్కడ జరగనుందంటే? - Prabhas Hanu Raghavapudi Movie - PRABHAS HANU RAGHAVAPUDI MOVIE

Prabhas Hanu Raghavapudi Movie Shooting : ప్రభాస్ హను రాఘవపూడి సినిమా షూటింగ్​ అప్డేట్​ గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఈ సినిమా షూటింగ్​ ఎప్పుడు, ఎక్కడ జరగనుందంటే?

Source Getty Images, ETV Bharat
Prabhas Hanu Raghavapudi Movie (Source Getty Images, ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2024, 9:54 PM IST

Prabhas Hanu Raghavapudi Movie Shooting : 'కల్కి 2898 AD'తో భారీ సక్సెస్ అందుకున్న పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్​ ప్రస్తుతం రాజాసాబ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే పనిలో ఉన్నారు. షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు మారుతీ రాజాసాబ్ చిత్రాన్ని పూర్తి హారర్​ ఎంటర్‌టైనర్ సినిమాగా తెరకెక్కిస్తుండగా ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన సీతారామం ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపూడితో ఓ సినిమా చేయనున్నారు. రీసెంట్​గానే పూజా కార్యక్రమాలతో లాంఛ్​ అయిన ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్​ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.

అయితే తాజా సమాచారం ప్రకారం వచ్చే వారం నుంచే 'ఫౌజీ' షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. సినిమా షూటింగులో భాగంగా ఫస్ట్ షెడ్యూల్‌ను తమిళనాడులోని కారైకుడిలో పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో కీలకమైన సన్నివేశాలను తమిళనాడులోని కారైకుడి ప్యాలెస్‌లో చిత్రీకరించబోతున్నారట. ఈ షెడ్యూల్‌ అంతా ప్రభాస్​కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతాయని తెలుస్తుండగా, సెకండ్ షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకమైన సెట్స్ కూడా సిద్ధం చేస్తున్నారని సమాచారం. అయితే దీని గురించి చిత్ర యూనిట్ త్వరలో మరిన్ని వివరాలు ఇవ్వనున్నట్లు సమాచారం.

దర్శకుడు హను ఈ చిత్రాన్ని రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారట. స్ట్రాంగెస్ట్ ఎమోషనల్ లవ్ డ్రామా యాంగిల్​తో పాటు సుభాష్ చంద్రబోస్, ఇండియన్ నేషనల్ ఆర్మీ గురించి ఈ సినిమాలో చూపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్​గా నటిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

కాగా, రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో పాటు సలార్ 2, కల్కి 2898 ఏడీ సీక్వెల్​, స్పిరిట్ ప్రాజెక్టులు కూడా ప్రభాస్ త్వరలోనే పట్టాలెక్కించనున్నారు . ది రాజా సాబ్ సినిమా అయిన వెంటనే స్పిరిట్ సినిమా చేస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు స్పిరిట్ చిత్రం కన్నా ముందు హను రాఘవపూడి ప్రాజెక్టు ముందుకొచ్చింది. ఇంకా ప్రభాస్, మంచు విష్ణు కన్నప్ప సినిమాలోనూ అతిథి పాత్రలో కనిపించనున్నారు.

బాలీవుడ్​ భారీ సీక్వెల్​ మూవీలో ప్రభాస్​, సూర్య! - Prabhas Suriya Cameo Roles

OTTలోకి శోభిత ధూళిపాళ్ల లవ్, హార్ట్​ బ్రేక్​ స్టోరీ! - ఆ రోజు నుంచే స్ట్రీమింగ్​ - Sobhita Dhulipala Love Sitara OTT

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.