ETV Bharat / entertainment

'రామాయణ' సెట్స్​లోకి రావణ'యశ్'​ - అప్పుడు నుంచే! - Ramayana Yash - RAMAYANA YASH

Bollywood Movie Ramayan Yash : 'రామాయణ' మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడిగా రణబీర్ నటిస్తుండగా రావణుడి పాత్రలో కేజీయఫ్​ 'యశ్'​ కనిపించనున్నట్లు సమాచారం. అయితే తాజాగా యశ్​ ఎప్పుడు ఈ మూవీ సెట్స్​లోకి అడుగుపెడతారో సమాచారం అందింది. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Bollywood Movie Ramayan Yash (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2024, 8:48 PM IST

Bollywood Ramayan Movie Yash : బాలీవుడ్ లోనే అత్యంత భారీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మకమైన ఇతిహాస చిత్రం రామాయణ. ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించనుండగా సీత పాత్రలో సౌత్ బ్యూటీ సాయి పల్లవి కనిపించనుంది. వీరితో పాటు ఈ సినిమాలో రావణుడిగా యశ్​, హనుమంతుడి పాత్రలో సన్నీ దేఓల్​ నటించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చాలా రోజులుగా తిరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం వీరు త్వరలోనే సెట్స్ పైకి కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

నితీశ్​ తివారీ దర్శకత్వంలో ముస్తాబవుతున్న రామయణ చిత్ర షూటింగ్ పనులు మార్చి 2024లోనే మొదలు పెట్టినప్పటికీ ముందుగా శ్రీరాముడి పాత్ర పోషిస్తున్న రణబీర్ కపూర్ యాక్టింగ్ భాగాన్ని పూర్తి చేయాలనుకుందట సినిమా టీం. ఇప్పటికే రణబీర్ కపూర్ పాత్రకు సంబంధించి షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయిపోయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

Ramayan Movie Shooting : మరోవైపు రావణుడి పాత్ర పోషించేందుకుగానూ కన్నడ స్టార్ యశ్​ స్క్రీన్ టెస్ట్ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నారనీ, అతి త్వరలో సెట్స్​లో కూడా కాలు మోపనున్నట్లు తాజాగా ముచ్చటించుకుంటున్నాయి సినీవర్గాలు. 2024 డిసెంబరు నుంచి 2025 మార్చి వరకూ యశ్​ రెగ్యులర్ షూటింగులో పాల్గొని, రామాయణ పార్ట్-1లో ఆయన చిత్రీకరణ భాగాన్ని పూర్తి చేయనున్నారట. ఆ తరువాత అంటే 2025 సమ్మర్ నుంచీ హనుమంతుడి పాత్రలో నటించనున్న సన్నీ దేఓల్​ షూటింగ్​లో పాల్గొనేలా ప్లాన్ చేసిందట రామాయణ టీమ్​.

ఇలా విడివిడిగా వీరి షూటింగులను పూర్తి చేసిన తర్వాత రాముడు, రావణుడు, హనుమంతుడు కలిసి కనిపించే సన్నివేశాల కోసం రణబీర్, యశ్​, సన్నీదేఓల్​ ముగ్గురు కలిసి 2025 సమ్మర్ తర్వాత షూటింగ్ పాల్గొనేలా ముగ్గురి డేట్స్ తీసుకున్నారట డైరెక్టర్ నితీష్. అయితే సినిమాలో సీత పాత్రలో కనిపించనున్న సాయి పల్లవి షూటింగ్​కు సంబంధించిన సమాచారం మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు.

Ramayan Movie Release Date : ఇటు సినిమా షూటింగుతో పాటు వీఎఫ్ఎక్స్ పనులను కూడా వేగంగా కొనసాగిస్తున్నారట రామాయణ చిత్ర యూనిట్. ఇండియన్ సినిమా గర్వించేలా ఈ చిత్రం ఉండబోతుందని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లు రాకుండా, ఏ మాత్రం తగ్గకుండా తీయాలనుకుంటున్నారనీ తెలుస్తొంది. ఆగష్టు 2025 నాటికల్లా అన్ని పాత్రల షూటింగ్ అయిపోవాలని పట్టుదలగా పనులు పూర్తి చేస్తున్నారట. ఎలాగైనా 2026 సంవత్సరానికల్లా రామాయణ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తన్నట్లు సమాచారం.

'అండర్​ వాటర్​లో 38 రోజులు షూట్​ చేశాం - ఆ 40 నిమిషాలు డోంట్ మిస్​​' : ఎన్టీఆర్ - Devara Movie

'రామాయణ'లో రణ్​బీర్​ ద్విపాత్రాభినయం - ఆ పాత్రకు అమితాబ్​ వాయిస్ ఓవర్​! - Ramayan Ranbir Kapoor

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.