శ్రీకాళహస్తిలో సందడి చేసిన ఇటలీ భక్తులు- సెల్ఫీలకు పోటీ పడిన స్థానికులు - Italian Devotees

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 7:41 PM IST

Devotees from Italy Visiting Srikalahasteeshwara Temple in Tirupati District : దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ చెందిన శివాలయాల్లో ఒకటైన శ్రీ కాళహస్తీశ్వర ఆలయాన్ని ఇటలీ దేశానికి (Italy) చెందిన భక్తులు దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా (Tirupati) సువర్ణముఖీ నది తీరంలో వెలిసిన ఈ ఆలయాన్ని ఇటలీ యాత్రికుల బృందం సందర్శించింది. సాంప్రదాయ వస్త్రాలను దర్శించి ఆలయంలోని స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

Italian Devotees Crowded Around the Temple : స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం ఆలయ పరిసర ప్రాంతాల్లో స్థానిక భక్తులతో సరదాగా కాసేపు గడిపారు. వారితో సంతోషంగా ముచ్చటించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోనే స్థానికులతో కలిసి ఫొటోలు దిగారు. ఈ క్రమంలో పలువురు స్థానికులు ఇటలీ భక్తులతో సెల్పీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయాన్ని (srikalahasteeshwara temple) దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇటలీ భక్తులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.