LIVE: మంగళగిరిలో పవన్ కల్యాణ్ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - pawan kalyan media conference - PAWAN KALYAN MEDIA CONFERENCE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 22, 2024, 10:19 AM IST
|Updated : Aug 22, 2024, 10:55 AM IST
Pawan Kalyan Media Conference Live: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల 23వ తేదీ నుంచి పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టే పనుల్ని గ్రామ సభల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. గ్రామసభల నిర్వహణ విధి విధానాలపై ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ పకడ్పందీగా వ్యవహరించాలని పవన్ సూచించారు. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టేందుకు అవకాశం ఉందని, ప్రజలకు ఉపయుక్తంగా ఉండే పనులు చేపట్టేలా గ్రామ సభల్లో చర్చించాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రతీ రూపాయి బాధ్యతతోనే వ్యయం చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు ఈ పథకం పనులు అమలుపై బాధ్యత తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రస్తుతం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Aug 22, 2024, 10:55 AM IST