LIVE : సచివాలయంలో మీడియాతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క - Bhatti Vikramarka Live - BHATTI VIKRAMARKA LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-10-2024/640-480-22625854-thumbnail-16x9-bhatti.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Oct 7, 2024, 3:10 PM IST
|Updated : Oct 7, 2024, 4:25 PM IST
Deputy CM Bhatti Vikramarka on Musi River and Hydra Live : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ ప్రక్షాళన, మరోవైపు హైదరాబాద్ నగరంలో చెరువుల రక్షణ కోసం హైడ్రాను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడుతున్నారు. నగరంలో హైడ్రా తీరును, వాటిపై వస్తున్న విమర్శలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. లేక్స్ లేకపోతే వరదలు వచ్చినప్పుడు, ఇటీవల విజయవాడ నగరం వరదలో చిక్కుకుపోయిన పరిస్థితులు హైదరాబాదులోనూ ఏర్పడతాయని చెప్పారు. నదీ గర్భంలో ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారని, వీటిని ఇప్పటికీ ఆపకపోతే భవిష్యత్తు తరాలకు పెద్ద ప్రమాదం వాటిల్లుతుందన్నారు. హైదరాబాద్ ప్రాణాంతకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లను అడ్డంపెట్టి బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టి వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయంలో భట్టి విక్రమార్క నిర్వహించిన ప్రెస్ మీట్‌ను ప్రత్యక్షంగా వీక్షిద్దాం.
Last Updated : Oct 7, 2024, 4:25 PM IST