నేడు విశాఖకు రక్షణ శాఖ మంత్రి రాక- రోజంతా సముద్రంలో గడపనున్న రాజ్‌నాథ్ సింగ్ - Rajnath Singh To Visakha INS Dega - RAJNATH SINGH TO VISAKHA INS DEGA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 14, 2024, 10:14 AM IST
Defence Minister Rajnath Singh To Visakha INS Dega : కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన రాజ్‌నాథ్‌సింగ్ తొలిసారి విశాఖలో పర్యటించనున్నారు. విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం వద్దకు ఆయన రానున్నారు. డే ఎట్ సీ కార్యక్రమంలో భాగంగా ఒక రోజంతా యుద్ద నౌకమీద సముద్రంలో ప్రయాణించనున్నారు. అనంతరం నౌకాదళ అధికారులతో సమావేశమవుతారు. యుద్ద నౌకల సన్నద్దతను పరిశీలించి నౌకాదళ సిబ్బందికి ఎదురయ్యే సవాళ్లను అధిగమించే తీరుపై సమీక్షించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
రెండోసారి రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్నాథ్్సంగ్ శుక్ర వారం విశాఖపట్నం లోని తూర్పు నౌకా దళం ముఖ్య కార్యాల యానికి రానున్నారు. ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటలకు ఢిల్లీలో బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు విశాఖపట్నంలోని నేవల్ ఎయిర్ స్టేషన్ 'ఐఎన్ఎస్ డేగా'కు చేరుకుం టారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి హెలి కాప్టర్లో బయలుదేరి 12.50 గంటలకు విశాఖ తీరంలో ఉన్న ఐఎన్ఎస్ జలాశ్వ నౌకపై దిగను -న్నారు. మధ్యాహ్నం 12.55 నుంచి 2.15 వరకు ఈస్ట్రన్ ప్లీట్లో 'డే ఎట్ సీ' కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని 3.15 గంటలకు విశాఖ షిప్ బిల్డింగ్ సెంటర్ను సందర్శిస్తారు. సాయంత్రం 4. 30 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని, అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి, సాయంత్రం 6.55 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు.