17 జిల్లాల్లో తాగునీటికి కటకట- సీఎస్ సమీక్షలో అధికారులు ఏమన్నారంటే! - Drinking water - DRINKING WATER
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 29, 2024, 12:15 PM IST
CS Jawahar Reddy Review with Officials on Drinking Water: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరా పరిస్థితులపై జల వనరులు, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, పట్టణ మంచినీటి సరఫరా విభాగాల అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని సీపీడబ్ల్యూఎస్(CPWS) స్కీమ్‌లు సమక్రంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతిరోజు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని సూచించారు. తాగునీటి సరఫరా పరిస్థితులను గ్రామ స్థాయి వరకూ సంబంధిత శాఖల అధికారులు ప్రతిరోజు మానిటర్ చేయాలని తెలిపారు.
తాగునీటి ఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకుల ద్వారా సరఫరా చేసే విధానాన్ని మానిటర్ చేసేందుకు రూపొందించిన యాప్‌ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. 9 జిల్లాల్లో తాగునీటికి పెద్దగా ఇబ్బంది లేదని నివేదించిన కలెక్టర్లు మిగతా 17 జిల్లాల్లోనూ ఇబ్బందులు అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని సీఎస్‌కి వివరించారు. 388 కరవు మండలాలు, 492 ఇతర మండలాలు మొత్తం 885 ఆవాసాలకు ట్యాంకులు ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రతిపాదనలు రాగా ఈ నెలలో 109 ఆవాసాలకు అందించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. 2 యూఎల్బీలకు ఏప్రిల్ 15 వరకు, 16 యూఎల్బీలకు ఏప్రిల్ 30 వరకు, 25 యూఎల్బీలకు మే 31 వరకు, 20 యూఎల్బీలకు జూన్ 30 వరకు తాగునీటికి ఇబ్బంది లేదని సీడీఎంఏ(CDMA) తెలిపారు.