'హైదరాబాద్లో ఆస్తులు కొంటే భద్రత'కు భరోసా ఇస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క - Credai Property Show in Hyderabad
🎬 Watch Now: Feature Video
Published : Mar 10, 2024, 10:13 PM IST
Credai Property Show in Hyderabad : ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో నిర్మాణరంగం పాత్ర ముఖ్యమైందని, వారికి సహకరించేందుకు తాము అన్ని వేళలా అందుబాటులో ఉంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లో ఆస్తులు కొంటే భద్రత ఉంటుందనే భావనను తమ ప్రభుత్వం కలుగజేస్తుందన్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న క్రెడాయ్ ప్రాపర్టీ షో ముగింపు వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
నిర్మాణరంగం వాళ్లకు సహకరించేందుకు తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మరోవైపు తమది కన్స్ట్రక్షన్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని, నగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, అందుకోసం మెట్రో ట్రాన్స్ఫోర్టును అభివృద్ధి చేస్తామని మంత్రి చెప్పారు. ఒకే వేదికపై 100కు పైగా రెరా రిజిస్ట్రేషన్ కలిగిన సంస్థలు తమ ప్రాజెక్టుల వివరాలను ఇక్కడ ప్రదర్శించాయి. డెవలపర్లు, మెటీరియల్స్, ఇంటీరియల్స్, ఫైనాన్స్ సంస్థలు తమ స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేశారు.