కూటమి విజయంతో కనువిప్పు- అమరావతిలో సీఆర్డీఏ దిద్దుబాటు చర్యలు - Cleaning at Amaravati - CLEANING AT AMARAVATI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 6, 2024, 7:52 PM IST
CRDA Officials Started Cleaning at Amaravati: వైఎస్సార్సీపీ అధికారం నుంచి దిగిపోవడంతోనే రాజధానికి వెలుగు వచ్చింది. ఈ ఐదేళ్లూ అమరావతి వైపు కనీసం కన్నెత్తి చూడని సీఆర్డీఏ అధికారులు కూటమి విజయంతో రాజధానిలో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పిచ్చిమొక్కలతో అడవిని తలపించిన ప్రాంతంలో శుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు. రాజధాని అభివృద్ధి గురించి ఎన్నిసార్లు అడిగినా స్పందించని అధికారులు ఇప్పుడు ఆగమేఘాలపై పనులు చేస్తుండటంతో అమరావతి రైతులు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వం మారేసరికి ఉద్యోగాలు కాపాడుకునేందుకు సీఆర్డీఏ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు కదిలొచ్చి పనులు చేయిస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
"వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువైపు కన్నెత్తి కూడా చూడని అధికారులు కూటమి గెలిచేసరికి అమరావతిలో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రాజధాని అభివృద్ధి గురించి ఎన్నిసార్లు అడిగినా స్పందించని అధికారులు పిచ్చిమొక్కలతో అడవిని తలపించిన ప్రాంతంలో ఆగమేఘాలపై శుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం మారేసరికి ఉద్యోగుల్లోనూ మార్పు వచ్చింది."
- అమరావతి రైతులు