ఎన్నికలు సజావుగా జరుగుతాయని నమ్మకం లేదు - డీజీపీని మార్చాలి: సీపీఐ రామకృష్ణ - CPI RAMAKRISHNA FIRES ON YSRCP GOVT - CPI RAMAKRISHNA FIRES ON YSRCP GOVT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 5:04 PM IST

CPI State Secretary Rama krishna Fires on YSRCP Govt: సీఎం జగన్ ఒక కాలు కింద పార్టీ నేతలను, ఒక కాలుతో అధికారులను అణచి వేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఈ ఐదుగురు ముఠాగా ఏర్పడి రాష్ట్రంలో రెడ్ల పాలన సాగించారని రామకృష్ణ మండిపడ్డారు.

Rama krishna Comments on Jagan Mohan Reddy: రాష్ట్రాన్ని వైఎస్సార్సీపీ కనుసన్నుల్లో నడిపారని, ప్రజాస్వామ్య పాలన సాగలేదని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పాలన మెుత్తం జగన్మోహన్ రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నారని, మంత్రులకు అధికారం లేదన్నారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పోలీసు వ్యవస్థపై గౌరవం లేకుండా పక్షపాత వైఖరితో నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి వల్ల ఎన్నికలు సజావుగా సాగుతాయని నమ్మకం లేదని డీజీపీని మార్చాలని రామకృష్ణ తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.