ఎన్నికల కోడ్ ముందు రోజు ఆ కంపెనీకి 17 వేల ఎకరాల భూమి-మేం వ్యతిరేకిస్తున్నాం: సీపీఐ - Indosol Land Allotments - INDOSOL LAND ALLOTMENTS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 24, 2024, 4:29 PM IST
CPI on Indosol Company land allotments : ఎన్నికల కోడ్ ప్రకటించే ఒక రోజు ముందు, సీఎం జగన్ 17 వేల ఎకరాల భూమిని ఇండోసోల్ కంపెనీకి కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) అన్నారు. అధికారంలోకి వచ్చింది మెుదలూ సీఎం తన బినామీ కంపెనీ అయిన ఇండోసోల్‌కు 25 వేల ఎకరాల భూములను కట్టబెట్టారని రామకృష్ణ మండిపడ్డారు. గతంలో ఇలాంటి భూ కేటాయింపుల కేసులను ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో సైతం కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. జగన్ తన బినామీ కంపెనీలకు భూములు కేటాయించడం బరితెగింపుకి నిదర్శనం అన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఇంతలా బరితెగించిన దాఖలాలు లేవని విమర్శించారు. మరోవైపు వైఎస్ఆర్ కడప జిల్లాలో వైసీపీ నాయకుల భూదాహానికి కుటుంబం బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని రామకృష్ణ హెచ్చరించారు.