జగన్ 10 ఏళ్లుగా బెయిల్పై బయట-ఇది ఎలా సాధ్యం? - సీపీఐ నారాయణ - CPI Narayana comments
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 4:33 PM IST
CPI Narayana Fires on CM YS Jagan: కోడికత్తి కేసులో అయిదేళ్లుగా కోర్టుకు వెళ్లని సీఎం జగన్పై 420 కేసు పెట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కోడికత్తి కేసులో జగన్ ఎందుకు సాక్ష్యం చెప్పలేదని ప్రశ్నించిన ఆయన, దీనిపై కోర్టు ఎందుకు జోక్యం చేసుకోవటంలేదన్నారు. బీజేపీకి అనుకూలమైన వారిపై కేసులుండవని విమర్శించారు. 45 వేల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ 10 ఏళ్లుగా బెయిల్పై బయటే ఎలా ఉన్నారని నిలదీశారు.
బీజేపీ పాలనలో రాజకీయ వ్యవస్థను ధ్వంసం చేశారని నారాయణ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశారని అన్నారు. ఎన్నికల సంఘాన్ని సైతం వారి చెప్పినట్టే వినే విధంగా చేసుకున్నారని ఆరోపించారు. బీజేపీను వ్యతిరేకించిన వారిపై మాత్రమే కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. బీజేపీకి అనుకూలంగా లేరని ఇతర రాష్ట్రాల నేతలపై కేసులు పెడుతున్నారు, కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం 10 సంవత్సరాలుగా బెయిల్పై ఉన్నారని తెలిపారు. ఇది ఎలా సాధ్యమైందని ఆయన ప్రశ్నించారు.