నకిలీ బిల్లులతో ఇసుక తరలింపు - ట్రాక్టర్లను సీజ్ చేసిన అధికారులు - illegal sand Transportation - ILLEGAL SAND TRANSPORTATION
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-05-2024/640-480-21525783-thumbnail-16x9-illegal-sand-transportation.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 21, 2024, 9:54 PM IST
Illegal Sand Transportation: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను సీపీఐ నాయకులు అడ్డుకున్నారు. సంతేబిదనూరు వద్ద పెన్నా నదిలో అక్రమ ఇసుక యథేచ్ఛగా తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు పెన్నా నదిలో కొనసాగుతున్న అక్రమ ఇసుక దందాను ఆపాలని నిరసన వ్యక్తం చేశారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ, దాదాపు నెల రోజులుగా నకిలీ బిల్లులతో వెయ్యి ట్రాక్టర్ల ఇసుకను కర్ణాటకకు అక్రమంగా తరిలిస్తున్నారన్నారు. ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరు మీదగా నకిలీ బిల్లులతో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని నిరసనకారులు ఆరోపించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పత్రికలు, టీవీల్లో ఇసుక దందాపై కథనాలు ప్రచురితమైనా ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఇసుక తరలిస్తున్న ప్రాంతానికి వెళ్లి తరలింపును అడ్డుకున్నారు. ఇసుక అక్రమ తరలింపు విషయాన్ని జిల్లా కలెక్టర్కు తెలియజేశారు. దీనిపై అధికారులు ఇసుక తరలిస్తున్న ప్రాంతానికి చేరుకొని ఎనిమిది ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.