పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐకు 5 స్థానాలు కేటాయించాలి: చాడ వెంకట రెడ్డి - పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐ పోటీ
🎬 Watch Now: Feature Video
Published : Feb 10, 2024, 8:50 PM IST
CPI Chada Venkat Reddy Demand to 5 Parliament Seats : ఇండియా కూటమిలో సీపీఐ ఉన్నందున తెలంగాణలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో, ఆ పార్టీకి ఐదు సీట్లు ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, పొత్తు వల్ల సీపీఐ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి బదిలీ అవుతాయన్నారు.
CPI Contest in Parliament Elections 2024 : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా నదీ జలాల వినియోగంపై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోదీ రాముని పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించాలని, కూటమి బలోపేతమే దేశ భవిష్యత్‌పై ఆధారపడి ఉంటుందన్నారు. ఒకరిద్దరు కూటమి నుంచి తప్పుకున్నా సరే, వారిని విడిచి ముందుకు సాగాలన్నారు. ప్రజాస్వామ్యం ఉండాలంటే మోదీ సర్కార్‌ను ఓడించి తీరాలని చాడ అభిప్రాయ పడ్డారు.