జల సంరక్షణలో ఆదర్శం 'బ్యాంకు కాలనీ' - రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పురస్కారాలు కైవసం - Rainwater Harvesting nagole - RAINWATER HARVESTING NAGOLE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : May 18, 2024, 2:16 PM IST

Cooperative Bank Colony  Rainwater Harvesting : భూమిపై ఉన్న ప్రాణకోటికి నీరే జీవనాధారం. అలాంటి నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది. ప్రతి ఇంట్లో నిత్యం దైనందిన కార్యక్రమాలు, అవసరాలకు ఉపయోగించే నీటి కన్నా వృథాగా పోయే నీరే ఎక్కువ. ఈ క్రమంలో వృథా నీటి, వర్షపు నీటిని ఒక చోటికి చేర్చితే భవిష్యత్‌ తరాలకు నీటి సమస్య తలెత్తకుండా ఉంటుందనే ఉద్దేశంతో తొమ్మిదేళ్ల కిత్రమే జల సంరక్షణలో భాగమయ్యారు నాగోల్‌లోని కో-ఆపరేటివ్‌ బ్యాంకు కాలనీవాసులు.

నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఏర్పాటు చేశారు. ప్రతి బొట్టు ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచుతున్నారు. మొదట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసే సమయంలో ఆర్థిక ఇబ్బందులు వస్తాయని తెలిసి, వాటికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతికి సమష్టిగా పని చేశామని కాలనీవాసులు అంటున్నారు. పర్యావరణాన్ని రక్షించడానికి విడతల వారీగా చెట్లు నాటుతున్నామని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి పురస్కారాలు అందుకుంటున్న ఆదర్శ కో-ఆపరేటివ్ బ్యాంకు కాలనీవాసులతో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.