హామీలు మరిచిన సీఎం జగన్- క్రమబద్ధీకరించాలని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల డిమాండ్ - Contract Staff Nurses Regularized
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2024, 5:44 PM IST
Contract Staff Nurses Demand That They Should be Regularized : ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు తాను అధికారంలోకి రాగానే క్రమబద్దీకరిస్తానని ఊదరగొట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే తమను పట్టించుకోలేదని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 11,500 మంది కాంట్రాక్ట్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నామని పేర్కొన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని ఇప్పుటికైనా అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు కడప ప్రెస్ క్లబ్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Contract Staff Nurses Meeting in YSR District : కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు విధులు నిర్వర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో కొంత మంది కాంట్రాక్ట్ నర్సులు మృతి చెందారని తెలిపారు. వైద్య వృత్తిలో నర్సులు పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. సీఎం జగన్ ఇప్పటికైనా కాంట్రాక్ట్ నర్సులను క్రమబద్ధీకరించాలని కోరారు. లేదంటే తాము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.