డబ్బులివ్వకుంటే బెయిల్ రాకుండా చేస్తా! - స్థలం గొడవ కేసులో నిందితుడిని బెదిరించిన కానిస్టేబుల్ - Constable Demand Money in Accused - CONSTABLE DEMAND MONEY IN ACCUSED
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-05-2024/640-480-21599785-thumbnail-16x9-constable.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 31, 2024, 11:54 AM IST
Constable Demanded Money From Accused in Proddutur: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని గ్రామీణ ఠాణాకు చెందిన ఓ కానిస్టేబుల్ తీరు విమర్శలకు దారి తీస్తోంది. డబ్బులు ఇవ్వకుంటే బెయిల్ రాకుండా చేస్తానని కానిస్టేబుల్ ఓ వ్యక్తిని బెదిరించి, దుర్భాషలాడిన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పట్టణానికి చెందిన రెండు కుటుంబాల మధ్య ఆస్తి విషయంలో ఇటీవల గొడవ జరిగి ఠాణాలో కేసు నమోదైంది. ఆ కేసులో ఓ వ్యక్తిని రిమాండ్‌కు పంపే క్రమంలో నిందితుడిని కానిస్టేబుల్ రూ.5 వేల రూపాయలు డిమాండ్ చేశారు. రూ.2 వేలు ఇస్తామన్నా ఒప్పుకోలేదు. చివరకు రూ.3 వేలు ఇవ్వాలనే కానిస్టేబుల్ వాయిస్ రికార్డు ఒకటి బయటకు వచ్చింది.
కానిస్టేబుల్ ఇబ్బంది పెడుతుండటంతో బాధితుడు తనను ఆశ్రయించాడని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కరుణాకర్ యాదవ్ తెలిపారు. అతనిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు. దీంతో కానిస్టేబుల్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు కరుణాకర్ తెలిపారు. ఈ సంఘటనపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.