LIVE : విశాఖలో కాంగ్రెస్ బహిరంగ సభకు హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth attend in AP Meeting
🎬 Watch Now: Feature Video
Published : Mar 16, 2024, 5:42 PM IST
|Updated : Mar 16, 2024, 7:46 PM IST
Congress Public Meeting in Visakhapatnam: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తృష్ణా మైదానంలో కాంగ్రెస్ సభ నిర్వహిస్తోంది. విశాఖలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉక్కు నగరంలోని త్రిష్ణ మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘న్యాయసాధన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, పలువురు నాయకులు హాజరయ్యారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్వహిస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించనున్నారు. 1100 రోజుల్లో ఒక్కసారీ సీఎం జగన్ వచ్చి ఉద్యమానికి మద్దతు తెలపలేదు. ఈ నేపథ్యంలో నేటి సభకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రానుండటం, ఉక్కు పరిరక్షణకు డిక్లరేషన్‌ను ప్రకటించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఇచ్చింది. ఇటు విశాఖ సభలోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రైల్వే జోన్ అంశంపైనా ప్రకటన చేసే అవకాశం ఉంది. విశాఖలో నేడు కాంగ్రెస్ 'న్యాయ సాధన సభ' ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Mar 16, 2024, 7:46 PM IST