నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తా : మల్లు రవి - Mallu Ravi on MP Ticket

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 31, 2024, 10:21 PM IST

Congress Leader Mallu Ravi about MP Seat : నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి తానే బరిలో ఉంటానని రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లు రవి స్పష్టం చేశారు. వయస్సు రీత్యా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని, ఇప్పుడు తనకే అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ సభ్యులను కోరినట్లు ఆయన తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ టికెట్ తనకు కేటాయించేందుకు సీఎం రేవంత్​రెడ్డి సానుకూలంగా ఉన్నారని తెలిపారు.  

Mallu Ravi on NagarKurnool MP Ticket : గతంలో 2019లో కాంగ్రెస్ పార్టీ నుంచి నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేశానని, అప్పుడు తనకు 3 లక్షల ఓట్లు వచ్చాయని ​రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లు రవి గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జిల్లా ఎమ్మెల్యేల గెలుపు కోసం తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నానని, అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందరికీ అండగా ఉంటూ కృషి చేశానని పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.