సీఎం పర్యటన ఏర్పాట్లలో అపశ్రుతి - రాజస్థాన్ కార్మికుడికి తీవ్ర గాయాలు - uravakonda news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 22, 2024, 4:40 PM IST
Confusion in Arrangements for CM Jagan Visit : ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. సీఎం జగన్ పర్యటనను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉరవకొండ విద్యుత్ కార్యాలయ ఆవరణంలో ఉన్న కరెంట్ స్తంభంపై మరమ్మతులు చేసే క్రమంలో తురిపెరియా అనే రాజస్థాన్‌కు చెందిన ఒప్పంద కార్మికుడు వ్యక్తి ఒకసారిగా కాలు జారి కింద పడిపోయాడు. అతడు తీవ్రంగా గాయపడడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
Rajasthan Laborer who Slipped from Electricity Pole : గాయపడిన తురిపెరియా అనే కార్మికుడిని సహచరులు, స్థానికులు గమనించి హుటాహుటిన ఉరవకొండ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఉరవకొండలో వైద్యులు పరీక్షించి అనంతపురం జిల్లా ఆసుపత్రికి తరలించవలసిందిగా సూచనలు ఇచ్చారు. అనంతరం మెరుగైన చికిత్స అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన తన కుమారుడికి ఇలా జరగడంపై తల్లిందండ్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు.