భూమి పట్టాకు రూ.1.50 లక్షలు డిమాండ్- ఏసీబీ వలలో సూపరింటెండెంట్ - Officer Caught by ACB
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 11, 2024, 3:35 PM IST
Collectorate Superintendent Officer Caught by ACB in YSR District : వైఎస్సార్ జిల్లాలో చుక్కల భూమిని మార్చేందుకు రైతు నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటున్న అధికారిని ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. జిల్లాలోని వీఎన్ పల్లి మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన వీరపుశేఖర్ అనే రైతు తన 6 ఎకరాల చుక్కల భూమిని పట్టా భూమిగా మార్చులని కలెక్టరేట్లోని సి విభాగం సూపరింటెండెంట్ అధికారి ప్రమీలను కోరుకున్నారు. అందుకు ప్రమీల రూ.1.50 లక్షలు డిమాండ్ చేసింది.
చుక్కల భూమిని పట్టా భూమిని మార్చడానికి మొదటి విడతగా రూ. 50 వేలు ఇవ్వాలని సూపరింటెండెంట్ అధికారి ప్రమీల అడిగింది. అంత మొత్తం డబ్బును చెల్లించలేని వీరపు శేఖర్ అనే రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఇవాళ కలెక్టరేట్లో ప్రమీల రైతు నుంచి రూ.50 వేలను తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ గిరిధర్ బృందం ఆమెను పట్టుకున్నారు. ప్రమీలపై కేసు నమోదు చేసి కర్నూలులోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ గిరిధర్ తెలిపారు.