Rashid Khan Marriage : అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ ఓ ఇంటివాడయ్యాడు. అక్టోబర్ 03న రాజధాని నగరం కాబుల్‌లో ఓ ప్రైవేటు హోటల్లో రషీద్ పెళ్లి గ్రాండ్‌గా జరిగింది.పెళ్లి కోసం వెడ్డింగ్ హాల్‌ను ఫుల్ లైటింగ్‌తో గ్రాండ్‌గా డిజైన్ చేశారు. ఈ పెళ్లి వేడుకకు అఫ్గాన్ క్రికెట్ బోర్డు సీఈఓ నసీబ్ ఖాన్‌తో పాటు సీనియర్ ఆటగాళ్లు మహమ్మద్ నబీ, ముజీబ్ అర్ రెహ్మాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ తదితరులు హాజరయ్యారు. వివాహ వేడుకకు సంబంధించి వెడ్డింగ్ హాల్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, రషీద్ పెళ్లి చేసుకున్న అమ్మాయి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.
కాగా, రషీద్‌తో పాటు అతడి ముగ్గురు సోదరులు జకియుల్లా, రజా ఖాన్, అమీర్ ఖలీల్ కూడా ఒకేసారి వివాహం చేసుకున్నారు. ఈ నలుగురు నలుపు రంగు కుర్తా, పైన మెరూన్ కలర్ జాకెట్ ధరించారు. ఇక సంప్రదాయ పష్తూన్ ఆచారాల ప్రకారం వీరి వివాహం జరిగింది. అయితే రషీద్ సడెన్‌గా పెళ్లి వార్త చెప్పడంతో క్రికెట్ ఫ్యాన్స్ కాస్త ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక రషీద్‌కు ఫ్యాన్స్ సహా, పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 'వన్ అండ్ ఓన్లీ కింగ్ ఖాన్, రషీద్ ఖాన్‌కు శుభాకాంక్షలు. జీవితాంతం నీకు విజయం కలగాలని కోరుకుంటున్నా' అని సీనియర్ స్పిన్నర్ మహ్మద్ నబీ ట్విట్టర్లో పెళ్లి ఫొటోలు షేర్ చేస్తూ విషెస్ చెప్పాడు.
Congratulations to the one and only King Khan, Rashid Khan, on your wedding! Wishing you a lifetime of love, happiness, and success ahead.@rashidkhan_19 pic.twitter.com/fP1LswQHhr
— Mohammad Nabi (@MohammadNabi007) October 3, 2024
The wedding hall that will host Rashid Khan’s wedding ceremony in Kabul, Afghanistan today 🔥#ACA pic.twitter.com/FOM2GCkqZw
— Afghan Cricket Association - ACA (@ACAUK1) October 2, 2024
కాగా, రషీద్ ఖాన్ ప్రస్తుతం ప్రపంచ నెెం.1 టీ20 బౌలర్‌గా కొనసాగుతున్నాడు. 2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రషీద్ ఖాన్ గత 9ఏళ్లుగా జట్టులో కీలకంగా మారాడు. ఇప్పటివరకు 93 టీ20 మ్యాచ్‌ల్లో 152 వికెట్లు, 105 వన్డేల్లో 190 వికెట్లు పడగొట్టాడు. ఇక టెస్టుల్లో రషీద్ పెద్దగా ఆడలేదు. ఆడింది 9 ఇన్నింగ్సే అయినప్పటికీ అందులోనూ 34 వికెట్లతో రాణించాడు. గతనెల దుబాయ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ స్పిన్నర్ రషీద్ ఖాన్ అదరగొట్టాడు.
Scenes outside the hotel which is hosting Rashid Khan's wedding in Kabul. pic.twitter.com/LIpdUYVZcA
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 3, 2024
క్రికెట్లో అఫ్గానిస్థాన్ మార్క్- సంచలన ప్రదర్శనలకు కేరాఫ్ అడ్రస్! - SA vs AFG ODI Series
అఫ్గాన్‌లో క్రికెట్‌పై బ్యాన్- తాలిబన్ ప్రభుత్వం ప్లాన్! - Afghanistan Cricket Ban