ETV Bharat / state

ఇంకా బర్త్ సర్టిఫికెట్ తీసుకోలేదా? - అయితే ఇలా అప్లై చేసుకోండి! - how to get BIRTH CERTIFICATE

బర్త్ సర్టిఫికెట్.. శిశువు జన్మించినప్పుడు ఇచ్చే తొలి ధ్రువీకరణ పత్రం. ఈ సర్టిఫికెట్ ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. ఎందుకంటే.. దీంతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. అయితే, ఈ సర్టిఫికెట్ ఎలా పొందాలి?

BIRTH CERTIFICATE IN TELANGANA
BIRTH CERTIFICATE IN TELANGANA (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2024, 9:27 AM IST

How to Apply Birth Certificate in Telangana : ఆధార్, పాన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం మాదిరిగానే.. బర్త్​ సర్టిఫికెట్ కూడా చాలా అవసరం. ఇది శిశువు జన్మించినప్పుడు ప్రభుత్వం జారీ చేసే మొదటి ధ్రువీకరణ పత్రం. ముఖ్యంగా.. విద్యా సంస్థల్లో ప్రవేశం, ఆధార్ దరఖాస్తు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ, ఓటరు నమోదు, వివాహాల రిజిస్ట్రేషన్‌, కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ/ స్థానిక ప్రభుత్వాల ఉద్యోగ నియామకాలకు, కొన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. అయితే.. ఇంతకీ ఈ సర్టిఫికెట్​కు ఏవిధంగా అప్లై చేసుకోవాలి? ఏ ఏ పత్రాలు అవసరం? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జనన మరణాల చట్టం 1969 ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం వద్ద శిశువు పుట్టిన 21 రోజుల్లోపు బిడ్డ జననాన్ని నమోదు చేయడం తప్పనిసరి. తెలంగాణలో జనన నమోదు కోసం జీహెచ్​ఎంసీ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్లు సంబంధిత అధికారులుగా ఉంటారు.

ఈ వివరాలు నమోదు చేయడానికి ఎవరెవరూ బాధ్యులుగా ఉంటారంటే?

  • హాస్పిటల్​లో ప్రసవం జరిగితే.. మెడికల్ ఇన్​ఛార్జ్ శిశువు జననాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది.
  • ప్రసూతి గృహం, నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జననం జరిగితే.. వైద్యాధికారి జననాన్ని నమోదు చేయడానికి అర్హులుగా ఉంటారు.
  • గ్రామీణ ప్రాంతాల్లో జరిగే జననాన్ని నమోదు చేయడానికి.. ఇన్​ఛార్జ్ పోలీసులు, గ్రామ పెద్దలు అర్హులుగా ఉంటారు.
  • ఇంట్లో ప్రసవం జరిగితే.. ఇంటి పెద్దలు బిడ్డ జననాన్ని నమోదు చేయాలి.
  • ఒకవేళ మహిళ ఏదైనా కారణం చేత జైలులో ఉన్నప్పుడు డెలివరీ జరిగితే.. ఆ టైమ్​లో జైలుకు ఇన్​ఛార్జ్​గా ఉన్న అధికారి శిశువు జననాన్ని నమోదు చేసుకోవాలి.

అవసరమైన ధ్రువపత్రాలు :

  • పేరెంట్స్ ఐడెంటిటీ ప్రూఫ్
  • తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రం లేదా పదో తరగతి మెమో
  • తల్లిదండ్రుల వివాహ ధ్రువీకరణ పత్రం
  • ఆసుపత్రి లేదా వైద్య సంస్థచే జారీ అయిన పిల్లల జనన రుజువు

బర్త్​ సర్టిఫికెట్​కు ​ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

  • ఇందుకోసం ముందుగా యూనిఫైడ్ బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (UBDMIS) అధికారిక సైట్‌ను సందర్శించాలి.
  • తర్వాత హోమ్​ పేజీలో సిటిజన్ సెక్షన్​ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు దాని కింద​ కనిపించే సెర్చ్ బర్త్ డీటెయిల్స్ అనే ఆప్షన్​పై క్లిక్ చేస్త్ మరో పేజీ మీకు ఓపెన్ అవుతుంది.
  • అప్పుడు న్యూ పేజీలో డ్రాప్-డౌన్ మెను నుంచి రిజిస్ట్రేషన్ యూనిట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అక్కడ కనిపించే జనన సంబంధిత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
  • అప్పుడు అన్ని తప్పనిసరి వివరాలను అందించిన తర్వాత "Submit" అనే ఆప్షన్​పై నొక్కాలి.
  • తర్వాత సంబంధిత అధికారుల వెరిఫికేషన్ అనంతరం బర్త్ సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుంది.
  • అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. జనన రికార్డులలో జనన వివరాలన్నీ అందుబాటులో ఉంటేనే దరఖాస్తుదారు బర్త్​ సర్టిఫికెట్​ కోసం అప్లై చేసుకోవడానికి అర్హులు.
  • అదే.. జనన సంబంధిత వివరాలు లేకపోతే మీరు సమీపంలోని కమిషన్ ఎండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(C&DMP) లేదా పంచాయతీని సంప్రదించి అధికారుల సూచనలతో మీరు బర్త్ సర్టిఫికెట్ పొందవచ్చు!

ఇవీ చదవండి :

ఆన్​లైన్​లో కుల ధ్రువీకరణ పత్రం.. ఎలా పొందాలో తెలుసా..?

దివ్యాంగులకు గుడ్​న్యూస్ - ఇక నుంచి సదరం స్లాట్ ఈజీగా బుక్ చేసుకోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.