LIVE : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు - పాల్గొన్న సీఎం రేవంత్ - CM Revanth Visit in Yadadri Temple
🎬 Watch Now: Feature Video
Published : Mar 11, 2024, 10:36 AM IST
|Updated : Mar 11, 2024, 11:35 AM IST
CM Revanth Live : యాదాద్రీశుల వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా తిరుమంజనంతో గర్భగుడిని శుద్ధి చేశారు. ప్రప్రథమంగా విష్వక్సేన ఆరాధన, స్వస్తివచనం నిర్వహిస్తున్నారు. సాయంత్రం మృత్స్యంగ్రహణం, అంకురార్పణ పర్వాలు చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, సాయంత్రం భేరీపూజ, హవనం, దేవతలకు ఆహ్వానం క్రతువులు నిర్వహించనున్నారు.పదకొండు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు రూ.1.60 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్‌లో రూ.60 లక్షలు విద్యుత్ అలంకరణకు కేటాయించారు. ఈ నెల 17న స్వామివారి ఎదుర్కోలు, ఈనెల 18న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈనెల 19న స్వామివారి దివ్య విమాన రథోత్సవం జరగనుంది. మాడవీధిలో భక్తులు ఎండ నుంచి ఇబ్బందులు పడకుండా చలువ పందిళ్లు, తాగునీటి కోసం ప్రత్యేక కుళాయిలు సిద్ధం చేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు స్వస్తి పుణ్యాహవాచనంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 21న అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో ముగుస్తాయి. తాజాగా తొలిరోజు ఏర్పాటు చేసిన బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
Last Updated : Mar 11, 2024, 11:35 AM IST