LIVE : తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన దళాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ - CM REVANTH LAUNCH SDRF LIVE
🎬 Watch Now: Feature Video
Published : Dec 6, 2024, 4:41 PM IST
|Updated : Dec 6, 2024, 7:03 PM IST
Telangana SDRF Launch Live : రాష్ట్రంలో సరికొత్త దళం అనేక ఆధునిక హంగులతో అందుబాటులోకి రానుంది. జాతీయ విపత్తు స్పందన దళం తరహాలో తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన దళం రంగంలోకి దిగనుంది. భారీ అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపం వంటి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహాయ చర్యలు చేపట్టడానికి ఈ దళం సిద్ధమవుతోంది. తెలంగాణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దాదాపు 2000 మంది సిబ్బందితో ఇది ఏర్పాటవుతోంది. అగ్నిమాపక శాఖలోని ఫైర్ స్టేషన్లు ఇక నుంచి ఎస్డీఆర్ఎఫ్(SDRF) స్టేషన్లుగా మార్పు చెందనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 137 ఫైర్ స్టేషన్లలోని దాదాపు వెయ్యి మంది సిబ్బందితో పాటు తెలంగాణ ప్రత్యేక పోలీసు విభాగానికి చెందిన పది కంపెనీలతో కూడిన 1000 మంది సిబ్బంది ఈ దళంలో విధులు నిర్వర్తించనున్నారు. ఈ దళాన్ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.ఎస్డీఆర్ఎఫ్ అమ్ములపొదిలో పలు అస్త్రాలు ఉన్నాయి. విపత్తు నిర్వహణ సిబ్బంది కోసం కొత్తగా 20 బస్సులు, ట్రక్కులు, బొలేరోలతో పాటు 40 వాటర్ బోట్లు కొనుగోలు చేశారు. అగ్నిప్రమాదాల్లో సహాయ చర్యల కోసం సిబ్బందికి శిరస్త్రాణాలు, చేతి గ్లౌజ్‌లు, కంటి అద్దాలు, రెఫ్లెక్టివ్ టేప్‌లు, సేఫ్టీషూ, మెడికల్ ఫస్ట్ రెస్పాండర్ కిట్లను సమకూర్చారు.
Last Updated : Dec 6, 2024, 7:03 PM IST