LIVE : సెక్రటేరియట్లో సీఎం రేవంత్రెడ్డి మీడియా సమావేశం - CM REVANTH REDDY PRESSMEET
🎬 Watch Now: Feature Video


Published : Oct 17, 2024, 4:26 PM IST
|Updated : Oct 17, 2024, 6:08 PM IST
CM Revanth Reddy Pressmeet Live : తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్య, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తూ మరోవైపు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లుగా వివరించారు. కానీ అనవసరంగా తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీలు బురద జల్లుతున్నాయని మండిపడుతున్నారు. దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. ఓ వైపు యువతను నైపుణ్యవంతమైన మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లాంటివి ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రం ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు నిరాధార పూరితమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.
Last Updated : Oct 17, 2024, 6:08 PM IST