LIVE : కర్ణాటకలోని గుర్మిట్కల్ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth Karnataka Meeting Live
🎬 Watch Now: Feature Video
Published : Apr 29, 2024, 3:05 PM IST
|Updated : Apr 29, 2024, 3:28 PM IST
CM Revanth Participated in Congress Public Meeting at Karnataka : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. దశల వారీగా కర్ణాటకలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. తెలుగు వారిని కాంగ్రెస్కు అండగా నిలవడంలో ఆయన తన వంతు పాత్రను పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే హస్తాన్ని ఆదరించిన కన్నడ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూనే, పదేళ్ల బీజేపీ సర్కార్ పాలనపై నిప్పులు చెరిగారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేసిందని, తెలంగాణలోనూ ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలయ్యాయని తెలిపారు. పదేళ్లలో మోదీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామన్న మోదీ మాట ఏమయ్యిందని, 40కోట్ల ఖాతాలు తెరిపించిన ప్రధాని, ఒక్క పైసా కూడా పేదల ఖాతాల్లో వేయలేదన్నారు. కరవు వస్తే కనీసం బెంగళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అలాంటి ప్రధానిని ఓడించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రజలకు అండగా ఉండే హస్తాన్ని గెలిపించుకోవాలని సూచించారు.
Last Updated : Apr 29, 2024, 3:28 PM IST