LIVE : హెచ్ఐసీసీలో బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు - ప్రత్యక్షప్రసారం - Balayya 50 years celebrations - BALAYYA 50 YEARS CELEBRATIONS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 1, 2024, 8:24 PM IST
|Updated : Sep 1, 2024, 8:41 PM IST
Actor Balayya 50 years celebrations live : యాక్టర్ నందమూరి బాలయ్య 50 సంవత్సరాల వేడుకలు హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంబురాల్లో బాలయ్య నటజీవితాన్ని ఆయన కొనియాడారు. ఒక యాక్టర్‌గా, సమాజసేవకుడిగా ఆయన సేవలు అభినందనీయమన్నారు. బసవతారకం ఆసుపత్రిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ తన వెండితెర ప్రయాణంలో 50 ఏళ్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఆయన తొలి చిత్రం 'తాతమ్మ కల' 1974 ఆగస్టు 30న విడుదలైంది. యాభయ్యేళ్లుగా ఆయన తిరుగులేని ప్రయాణం చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ తెలుగు అగ్ర కథానాయకుల్లో ఒకరిగా, వరుస సినిమాలతో అలరిస్తున్నారు. తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలయ్యకు సుదీర్ఘంగా డైలాగ్‌లు చెప్పడంలో అందెవేసిన చేయి. కెరీర్లో వందకు పైగా చిత్రాలు, వందలాది పైగా వేషధారణలు, చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ తర్వాత అన్ని పాత్రలు పోషించిన ఏకైక నటుడిగా నిలిచారు.
Last Updated : Sep 1, 2024, 8:41 PM IST