LIVE : ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి - INDIRAMMA HOUSES MOBILE APP LIVE
🎬 Watch Now: Feature Video


Published : Dec 5, 2024, 11:17 AM IST
|Updated : Dec 5, 2024, 12:37 PM IST
Indiramma Houses Mobile APP : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో కీలక పాత్ర పోషించే మొబైల్ యాప్ను నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కేంద్ర గృహ నిర్మాణ పథకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ను రూపొందించింది. ఇది వరకే మహబూబ్నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ యాప్ను పరిశీలించారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరించి యాప్లో నమోదు చేస్తారు. దరఖాస్తుదారుని పేరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆర్థిక పరిస్థితి, ఇళ్లు నిర్మించనున్న స్థలం, ఇతర వివరాలకు సంబంధించిన సుమారు 35 ప్రశ్నలు ఉంటాయి. ఆ వివరాల ఆధారంగా అర్హులను విడతల వారీగా గ్రామసభల ద్వారా ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేయనున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో దివ్యాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, సఫాయి కార్మాచారులకు ప్రాధాన్యమివ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Last Updated : Dec 5, 2024, 12:37 PM IST