thumbnail

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

ETV Bharat / Videos

LIVE : డిజిటల్‌ హెల్త్ కార్డు పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి - digital health card project launch

Digital Health Card Project Launch Live : కుటుంబ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. వివరాల సేకరణను నేటి నుంచి ఈ నెల 7 వరకు చేపట్టనున్నారని, ఒకే రాష్ట్రం ఒకే కార్డు విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం పేర్కొన్నారు. రేషన్, ఆరోగ్య సేవలతో పాటు సంక్షేమ పథకాలన్నీ కుటుంబ డిజిటల్ కార్డు ద్వారా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రతీ కుటుంబానికి ఒక ప్రత్యేక నంబరుతో కార్డు ఇవ్వనున్నారు. రేషన్‌ కార్డు, రైతు బంధు, ఫించను తదితర సంక్షేమ పథకాల్లో డేటా ఆధారంగా ఇప్పటికే కుటుంబసభ్యుల వివరాలు గుర్తించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా నేటి నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకుంటారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని 238 ప్రాంతాల్లో ఇంటింటి పరిశీలన జరగనుంది.ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. పూర్తి గ్రామీణ ప్రాంతాలున్న నియోజకవర్గంలో రెండు గ్రామాలు, పూర్తిగా పట్టణ, నగర ప్రాంతాల్లో రెండు వార్డులు లేదా డివిజన్లలో పైలట్ ప్రాజెక్టు చేస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారుల బృందాలు కుటుంబాలను నిర్ధారించడంతో పాటు కొత్త సభ్యులని చేర్చి, మరణించిన వారి పేర్లు తొలగిస్తారు.
Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.