LIVE : గౌడన్నలకు 'కాటమయ్య రక్షణ కవచం' కిట్ల పంపిణీ - ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్​ రెడ్డి - Safety kits For Gouds

By ETV Bharat Telangana Team

Published : Jul 14, 2024, 1:02 PM IST

Updated : Jul 14, 2024, 2:41 PM IST

thumbnail
CM Revanth Reddy launched Safety kits For Gouds : కల్లు గీత కార్మికుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక నుంచి ఎవరూ చెట్టుపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ప్రత్యేక కిట్లను తయారు చేసింది. కాటమయ్య రక్షణ కవచం పేరిట 6 పరికరాలున్న కిట్‌ను సిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడ తాటివనంలో గౌడ సోదరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిట్లను స్వయంగా అందిస్తున్నారు.ఆ తర్వాత విడుదల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కల్లుగీత కార్మికులందరికి కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాటమయ్య రక్షణ కవచం కిట్ల డెమో ప్రదర్శనను తిలకించి ఐదుగురు కార్మికులకు కిట్లు పంపిణీ చేసి గౌడన్నలతో సమావేశంలో మాట్లాడుతున్నారు. అందరితో  కలసి భోజనం చేశారు. బీసీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో గత 15 రోజులుగా 50 మందితో ఆ కిట్లపై లష్కర్‌గూడలో ట్రయల్ రన్ నిర్వహించారు. రంగారెడ్డి కలెక్టర్ శశాంక వాటిని స్వయంగా పరిశీలించారు.
Last Updated : Jul 14, 2024, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.