LIVE : కొత్తగా 100 బస్సులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి - ప్రత్యక్ష ప్రసారం - CM Revanth launch new buses
🎬 Watch Now: Feature Video
Published : Feb 10, 2024, 3:28 PM IST
|Updated : Feb 10, 2024, 4:09 PM IST
CM Revanth Reddy Launched 100 TSRTC New Buses Live : టీఎస్ఆర్టీసీకి అందుబాటులో మరో 100 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయి. మహాలక్ష్మీ పథకం కోసం 90 ఎక్స్ప్రెస్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. హైదరాబాద్- శ్రీశైలం మార్గంలో తొలిసారి 10 ఏసీ రాజధాని సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ ఆర్టీసీల బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికే 1000 కొత్త ఆర్టీసీలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం ఏర్పడిన మొదటిలో కొన్ని బస్సులను ప్రారంభించగా, ఇప్పుడు మరో 100 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీంతో మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణంలో బస్సులు సరిపోక ఎన్నో ఇబ్బందులను పడుతున్నారు. ఈ క్రమంలో మరో 100 బస్సుల రాకతో ప్రయాణం మరింత సౌకర్యంగా సాగనుంది.