LIVE : ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన - CM Revanth Inspect Flood Areas LIVE - CM REVANTH INSPECT FLOOD AREAS LIVE
🎬 Watch Now: Feature Video
Published : Sep 2, 2024, 5:22 PM IST
|Updated : Sep 2, 2024, 5:40 PM IST
CM Revanth Reddy Inspect Flood Affected Areas in Khammam : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య లేకుండా కమిషనర్లు చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయాలని అన్నారు. విద్యుత్ సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఖమ్మంలోని వరద సమస్యలపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో వర్షాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష ముగిసిన అనంతరం రోడ్డు మార్గం ద్వారా సీఎం రేవంత్ ఖమ్మం బయలుదేరారు. అక్కడికి చేరుకున్న తర్వాత వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. మున్నేరు వాగు చేసిన విధ్వంసాన్ని అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం ఆ ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు.
Last Updated : Sep 2, 2024, 5:40 PM IST