వరంగల్ 'జనజాతర' సభలో సీఎం రేవంత్ రెడ్డి - ప్రత్యక్షప్రసారం - CM Election Campaign Warangal - CM ELECTION CAMPAIGN WARANGAL
🎬 Watch Now: Feature Video
Published : Apr 24, 2024, 5:20 PM IST
|Updated : Apr 24, 2024, 6:50 PM IST
CM Revanth Election Campaign In Warangal LIVE : రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతోంది. రాష్ట్రంలో నామినేషన్ల గడువు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల్లో విస్త్తృతంగా ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తున్నారు. కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిని కడియం కావ్యకు మద్ధతుగా సీఎం ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఏఐసీసీ నేతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి పార్టీ శ్రేణులు శ్రమించాలని కోరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం పలు విమర్శలు గుప్పించారు.
Last Updated : Apr 24, 2024, 6:50 PM IST