LIVE : సిరిసిల్ల జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి - CM Revanth Jana Jatara Sabha LIVE - CM REVANTH JANA JATARA SABHA LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : May 3, 2024, 6:29 PM IST

Updated : May 3, 2024, 9:21 PM IST

CM Revanth Jana Jatara Sabha in Dharmapuri Live : రాష్ట్రంలో అత్యధిక లోక్​సభ స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతోంది. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్​కు ఇంకా తొమ్మిది రోజులే ఉండటంతో ప్రచారాలు మరింత జోరందుకున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో విస్త్తృతంగా ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరై కీలక ప్రసంగం చేస్తున్నారు. లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి పార్టీ శ్రేణులు శ్రమించాలని కోరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం పలు విమర్శలు గుప్పించారు. కార్యకర్తలకు ప్రచారంలో ముందుకు సాగేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేస్తున్నారు. నాయకులతో ముమ్మరం ప్రజాక్షేత్రంలో ఉండాలని తెలియజేస్తున్నారు.  
Last Updated : May 3, 2024, 9:21 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.