LIVE : సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth Reddy live - CM REVANTH REDDY LIVE
🎬 Watch Now: Feature Video
Published : Apr 24, 2024, 12:20 PM IST
|Updated : Apr 24, 2024, 12:36 PM IST
CM Revanth Live : రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అభ్యర్థుల తరఫున ప్రచారం చేసి ప్రభుత్వ పథకాల అమలు వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆగస్ట్ 15లోగా రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. వచ్చే వరి పంటకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల కష్టాలు నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని అన్నారు. ఈసారి తెలంగాణలో 15 లోక్సభ స్థానాలను గెలిచి సోనియాగాంధీకి కానుకగా ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మించాలని ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం ప్రారంభించామని తెలిపారు. తాజాగా రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విపక్షాలపై ఫైర్ అవుతున్నారు. ఈ మీటింగ్ అనంతరం ఆయన వరంగల్ జన జాతర సభలో పాల్గొననున్నారు.
Last Updated : Apr 24, 2024, 12:36 PM IST