LIVE : మహబూబాబాద్​ జనజాతర సభలో రేవంత్​ రెడ్డి - ప్రత్యక్ష ప్రసారం - Congress Leaders Election Campaign - CONGRESS LEADERS ELECTION CAMPAIGN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 5:21 PM IST

Updated : Apr 19, 2024, 6:19 PM IST

CM Revanth Reddy At Mahabubabad Jana Jatara Sabha Live : లోక్​సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లను గెలిచి, విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎంపీ అభ్యర్థుల నామినేషన్లకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెళుతూ అందరిలో జోష్​ నింపుతున్నారు. అనంతరం ఆయా నియోజకవర్గాల్లో సభ నిర్వహించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా ఎన్టీఆర్​ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన జాతర సభ పాల్గొన్నారు. లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.మహబూబాబాద్ నుంచి పార్టీ అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్‌ నేడు నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా జనజాతర సభకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జిల్లాకు మొదటిసారిగా వచ్చారు. ఈ కారణంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సభకు సీఎంతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్‌ చంద్రారెడ్డి, పార్టీ అభ్యర్థి బలరామ్‌ నాయక్‌, ఎమ్మెల్యే మురళి నాయక్‌లు హాజరయ్యారు.
Last Updated : Apr 19, 2024, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.