LIVE : ఈశ్వరీ బాయి వర్థంతి కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి - సీఎం రేవంత్రెడ్డి లైవ్
🎬 Watch Now: Feature Video
Published : Feb 24, 2024, 6:11 PM IST
|Updated : Feb 24, 2024, 6:30 PM IST
CM Revanth Reddy in Ravindra barathi LIVE : రవీంద్ర భారతిలో మాజీ మంత్రి గీతా రెడ్డి తల్లి ఈశ్వరీ బాయి వర్థంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గీతా రెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ నేత గీతా రెడ్డి తన తల్లి వర్థంతి కార్యక్రమం ఏటా నిర్వహిస్తుంటారు. తల్లి పేరిట అవార్డులు, సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈశ్వరీ బాయి పేరిట ఓ నర్సింగ్ కళాశాలను కూడా నడుపుతున్నారు. ఇవాళ్టీ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఉపన్యాసం చేయనున్నారు. త్వరలో చేపట్టబోయే పథకాల గురించి కూడా వివరించనున్నారు. ఈ నెల 27న ప్రారంభించే ఉచిత కరెంట్, సబ్సిడీ గ్యాస్ పథకాల గురించి కూడా వివరించనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు, పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Last Updated : Feb 24, 2024, 6:30 PM IST