LIVE : రవాణాశాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి - CM REVANTH LIVE
🎬 Watch Now: Feature Video
Published : Dec 5, 2024, 3:53 PM IST
|Updated : Dec 5, 2024, 4:58 PM IST
CM Revanth Reddy at Praja Palana Vijayotsavam Live : రవాణాశాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రవాణా శాఖ సాధించిన విజయాలపై ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్లో జరుగుతున్న సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బహిరంగ సభలో రవాణా శాఖ నూతన లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం రవాణా శాఖ, తెలంగాణ ఆర్టీసీ సాధించిన విజయాలపై బ్రౌచర్ విడుదల చేశారు. సభావేదికగా స్క్రాపింగ్ పాలసీ ఆర్డర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు. ఈ కార్యక్రమంలోనే ఆర్టీసీలో కారుణ్య నియామకాల కింద మరణించిన 54 మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేయనున్నారు. మహిళా ప్రయాణికుల బృందానికి మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు ఆదా అయిన మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేయనున్నారు.
Last Updated : Dec 5, 2024, 4:58 PM IST