వరద ప్రాంతాల్లో జేసీబీపై చంద్రబాబు పర్యటన - సహాయకచర్యలపై ఆరా - CM Chandrababu Tour On JCB - CM CHANDRABABU TOUR ON JCB
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 3, 2024, 6:58 PM IST
|Updated : Sep 3, 2024, 8:12 PM IST
CM Chandrababu Tour On JCB : విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం నుంచి సీఎం చంద్రబాబు పర్యటన నిర్విరామంగా కొనసాగుతోంది. నేడు సైతం జేసీబీ ఎక్కి నాలుగు గంటలుగా వరద ప్రభావిత కాలనీలను పరిశీలిస్తున్నారు. విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో సీఎం పర్యటించి బాధితులతో మాట్లాడారు. వృద్ధులు, దివ్యాంగులను అంబులెన్స్‌లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మూడు రోజులు పడిన కష్టాలను సీఎంకు వివరించారు. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా ఆయన బాధితులను పరామర్శించారు. అధికారులు చేస్తున్న సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. బాధితులను ఆహారం అందుతుందా లేదా అని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
Flood Affected Areas In Vijayawada : ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. ఇప్పటికీ కొంతమంది జలదిగ్బంధంలోనే ఉన్నారని బాధితులు తెలిపారు. ప్రతి ఒక్కరిని కాపాడే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. వాహనం వెళ్లగలిగినంత దూరం అందులో మిగిలిన చోట్ల కాలినడక వెళ్లారు. కొన్నిచోట్ల మోకాలి లోతు నీటిలోనూ నడుచుకుంటూ వెళ్లారు. పలు కాలనీల్లో చివర ఉన్న ఇళ్లకు ఆహారం అందడం లేదన్న అంశంపై ఆయన ఆరా తీశారు. జేసీబీపై సీఎం పర్యటిస్తుండటంతో సీఎం కాన్వాయ్ వివిధ ప్రాంతాల్లో తిరుగుతోంది. ఏడు పదుల వయస్సులో చంద్రబాబు జేసీబీ పర్యటనపై భద్రతా సిబ్బందిలో ఆందోళన నెలకొంది. చంద్రబాబు వరద బాధితులను చేస్తున్న సేవను గమనిస్తున్న పలువులు 'పని రాక్షసుడి'గా పోలుస్తున్నారు.