LIVE : తాళ్లాయపాలెలంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు
🎬 Watch Now: Feature Video
CM Chandrababu Started Gas Insulated Substation in Tallayapalem : రాజధాని అమరావతిలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తు సరఫరా కోసం నిర్మించిన 400/220కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ను (జీఐఎస్) సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ కేంద్రాన్ని రాజధాని ప్రాంతంలోని తాళ్లాయపాలెంలో ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఏర్పాటు చేసింది. రాజధాని ప్రాంతానికి ఇప్పటివరకు 220/132/33కేవీ తాడికొండ కేంద్రం నుంచి విద్యుత్తు సరఫరా అవుతోంది. అమరావతి నిర్మాణం జరుగుతున్నందున భవిష్యత్తులో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్తు సరఫరాకు ఇప్పట్నుంచే ప్రణాళికాయుతంగా ముందుకెళుతున్నారు. మైలవరం, బేతంచర్ల, పెనుకొండ, కోటలో సబ్‌స్టేషన్లను ఆన్‌లైన్‌లో ప్రారంభిస్తున్నారు. రూ.4,665 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అల్లూరి జిల్లాలో అప్పర్ సీలేరు పవర్ స్కీమ్ కోసం రూ.1,753 కోట్లు కేటాయించారు. సీఆర్డీఏ పరిధిలో లైన్ల మార్పుల కోసం రూ.1,042 కోట్లు , కొన్నిచోట్ల భూగర్భ కేబులింగ్ పనుల కోసం రూ.824 కోట్లు కేటాచారు.ప్రస్తుతం జీఐఎస్ ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం మీకోసం
Last Updated : 32 minutes ago