LIVE: శ్రీశైలంలో సీఎం చద్రబాబు - కృష్ణమ్మకు జలహారతి - Chandrababu Srisailam Tour Live - CHANDRABABU SRISAILAM TOUR LIVE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 1, 2024, 11:18 AM IST
|Updated : Aug 1, 2024, 11:54 AM IST
CM Chandrababu Srisailam Tour Live : శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అనంతరం శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాన్ని పరిశీలించి, నీటివినియోగదారుల సంఘం ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఇందుకోసం సున్నిపెంటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో చేపట్టిన ప్రజా వేదిక ఏర్పాటు పనులను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజశేఖర్రెడ్డి బుధవారం పరిశీలించారు.అనంతరం చంద్రబాబు శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో ఓబుళమ్మ, వృద్ధుడు రామన్నకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ సొమ్ము అందజేయనున్నారు. అనంతరం రంగనాధ్ అనే రైతుకు చెందిన మల్బరీ పంటను పరిశీలించి షెడ్డులో పట్టుపురుగుల పెంప కంపై చర్చిస్తారు. అక్కడి నుంచి కరియమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, ప్రజావేదికలో పాల్గొననున్నారప. రైతు పాండురంగ ప్పతో డ్రిప్ పరికరాల వివరాలు, కె. గుండుమలకు చెందిన బీఈడీ అభ్యర్థి శివకుమార్ మెగా డీఎస్సీపై అభిప్రాయం, కోతులగుట్టకు చెందిన లబ్దిదారుడు లోకేశ్తో హౌసింగ్, తిప్పేస్వామి అనే రైతుతో సెరికల్చర్కు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో చంద్రబాబు ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Aug 1, 2024, 11:54 AM IST