టీడీపీ ఆఫీస్‌కు సీఎం- టోల్ ప్రీ ఫిర్యాదు దారులతో భేటీ కానున్న చంద్రబాబు - CM Chandrababu to TDP Office - CM CHANDRABABU TO TDP OFFICE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 12, 2024, 9:01 PM IST
CM Chandrababu Naidu to TDP Central Office: సీఎం చంద్రబాబు నాయుడు శనివారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ భవన్‌ను సందర్శించనున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఇటీవల టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విడుదల చేసిన టోల్ ఫ్రీ నంబరును సంప్రదించిన ఫిర్యాదుదారులను ఆయన కలవనున్నారు.
ఇప్పటికే ఫిర్యాదులు చేసిన వారి కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్‌బాబు వెల్లడించారు. వీరు సీఎంను కలిసేందుకు కావాల్సిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదులు చేసిన వారు శనివారం ఉదయం 9:00 గంటల లోపు పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకోవాలని తెలిపారు. ముఖ్యమంత్రి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన వారిని కలిసి ఫిర్యాదులు స్వీకరిస్తారని అశోక్‌బాబు పేర్కొన్నారు. కాగా ప్రజల సమస్యలు తెలియజేసేందుకు జులై 1న పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు టోల్ ఫ్రీ నంబర్ 73062 99999 విడుదల చేసిన విషయం తెలసిందే.