చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్న వివాదాస్పద అధికారులు - CM No Interested MEET SOME Officers - CM NO INTERESTED MEET SOME OFFICERS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 14, 2024, 4:27 PM IST
CM Chandrababu Not Interested to Meet Some Officers : జగన్ ప్రభుత్వ హయాంలో కలంకిత అధికారులుగా మచ్చపడ్డవారు, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. నిన్న(గురువారం) ముఖ్యమంత్రి ఛాంబర్‌లో ఆయనను కలిసేందుకు యత్నించిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, సీఐడీ మాజీ చీఫ్ పీవీ. సునీల్ కుమార్‌ను సిబ్బంది అడ్డుకుని వెనక్కి పంపేశారు. చేసేది లేక వారు సమావేశ మందిరంలోకి వెళ్లారు. పీఎస్ఆర్ ఆంజనేయులు సమావేశ మందిరంలో ఎక్కువ సేపు ఉండలేక బయటకు వెళ్లిపోయారు. అధికారులందరితోనూ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాదపూర్వక భేటీ నిర్వహించారు.
భేటీ అనంతరం వారంతా ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీలక్ష్మీ కూడా సీఎం వెనక నుంచి వచ్చి పుష్పగుచ్చం ఇచ్చేందుకు యత్నించారు. ఎవరో అనుకుని తీసుకోబోయిన చంద్రబాబు శ్రీలక్ష్మిని చూడగానే సున్నితంగా తిరస్కరించారు. పీఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం వేగంగా సచివాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. గుంపులో దొరికిన అవకాశంతో పీవీ.సునీల్ కుమార్ చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇవ్వగలిగారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించాలనే చంద్రబాబు ఆకాంక్ష, దీక్ష నెరవేరాలని కోరుకుంటున్నట్లు సునీల్‌కుమార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.