LIVE జగన్ తిరుమల పర్యటన అంశంపై సీఎం చంద్రబాబు మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - CM Chandrababu media conference - CM CHANDRABABU MEDIA CONFERENCE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 27, 2024, 6:46 PM IST
|Updated : Sep 27, 2024, 7:18 PM IST
CM Chandrababu Naidu Media Conference: తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలను పాటించాలని కోరుతున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. భక్తుల మనోభావాలు, ఆచారాలకు భిన్నంగా ఏ ఒక్కరూ వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేశారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమైందని అన్నారు. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం మన అందరి అదృష్టమన్నారు. ఏడు కొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్ఠలతో, శ్రద్ధతో స్వామివారిని కొలుస్తారని అన్నారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని తేల్చిచెప్పారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలను, తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలను తప్పక పాటించాలని కోరుతున్నానన్నారు. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Sep 27, 2024, 7:18 PM IST