ఏపీలో న్యాయ వర్సిటీ - బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో సీఎం - CM Met BCI Representatives - CM MET BCI REPRESENTATIVES
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 16, 2024, 6:09 PM IST
CM Chandrababu Meeting with BCI Representatives : దేశంలో న్యాయ విద్య కోసం కృషి చేస్తున్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Bar Council of India) ఛైర్మన్ మన్నన్ కుమార్ మిశ్రా ఏపీలోనూ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రతిపాదనతో ముందుకు రావడం సంతోషదాయకమని సీఎం చంద్రబాబు అన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందంతో సమావేశం అయినట్టు సీఎం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. బెంగుళూరులోని ఎన్ఎల్ఎస్ఐయూ, గోవాలోని ఐఐయూఎల్ఈఆర్, తరహాలో ఏపీలో ఉన్నత స్థాయిలో న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్టు పెర్ల్ ఫస్ట్ ముందుకు రావడం సంతోషదాయకం అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న ప్రీమియర్ యునివర్సిటీలో అంతర్జాతీయ స్థాయి అర్బిట్రేషన్ కేంద్రం కూడా భాగం అవుతుందని సీఎం తెలిపారు. తద్వారా మరింత ప్రపంచ స్థాయి భాగస్వామ్యం వస్తుందని అన్నారు. దీంతో పాటు న్యాయ సంబంధిత అంశాల్లో నైపుణ్యం, విద్య మరింతగా వికసిస్తాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.