LIVE: సోమశిల జలాశయం వద్ద సీఎం చంద్రబాబు మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - CM Chandrababu media conference - CM CHANDRABABU MEDIA CONFERENCE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 19, 2024, 5:12 PM IST
|Updated : Aug 19, 2024, 5:40 PM IST
CM Chandrababu Media Conference at Somasila: ఉన్మాద, రాక్షస పాలన నుంచి బయటికొచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. సోమశిల జలాశయం వద్ద సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. అంతకుముందు తిరుపతి జిల్లా శ్రీసిటీ లో పర్యటించిన చంద్రబాబు 1570 కోట్ల రూపాయలతో నిర్మించిన పదహారు పరిశ్రమలను ప్రారంభించారు. తొమ్మిది వందల కోట్ల రూపాయలతో నిర్మించనున్న మరో ఎనిమిది పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. 1200 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పరిశ్రమలకు ఆయా సంస్థల యజమానులతో ఒప్పందాలు చేసుకొన్నారు.అనంతరం శ్రీసిటీలోని బిజినెస్ సెంటర్‌లో నిర్వహించిన సీఈఓ ల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న పలువురు సీఈఓ లు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం, తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. అనంతరం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రాష్ట్రం పెట్టుబడులకు అనువైన ప్రాంతమని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్తలకు ఉత్పత్తి, లాజిస్టిక్స్ ధరలను తగ్గించడానికి చర్యలు తీసుకొంటామన్నారు. సిటీ పర్యటన ముగించుకొన్న అనంతరం ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లా సోమశిల జలాశయాన్ని పరిశీలించారు. ప్రస్తుతం సోమశిల జలాశయం వద్ద సీఎం చంద్రబాబు మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం
Last Updated : Aug 19, 2024, 5:40 PM IST