శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు - కృష్ణమ్మకు జలహారతి - Chandrababu Jala Harathi Srisailam - CHANDRABABU JALA HARATHI SRISAILAM
🎬 Watch Now: Feature Video
Published : Aug 1, 2024, 3:15 PM IST
Chandrababu Jala Harathi in Srisailam Project in AP : శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా కృష్ణా నదికి ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Chandrababu Srisailam Tour : అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సున్నిపెంటకు చంద్రబాబు చేరుకున్నారు. అక్కడ నీటివినియోగదారుల సంఘం ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని సీఎం తెలిపారు. గత ఐదేళ్లు ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మొన్నటి ఎన్నికలు ఒక సునామీని తలపించాయని పేర్కొన్నారు. ఒక్కో స్థానంలో అత్యధిక మెజారిటీ సాధించామని చంద్రబాబు గుర్తుచేశారు.
ఎన్నికల్లో కూటమి ఇచ్చిన గ్యారంటీలన్నీ నెరవేరుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఖజానా ఖాళీగా ఉన్నా ఒక్కొక్క హామీని నెరవేర్చనున్నట్లు వివరించారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తమదని తెలిపారు. నీరు సంపద సృష్టిస్తుందని, సంపద వల్ల ప్రభుత్వాలకు ఆదాయం వస్తుందని వెల్లడించారు. సంపద సృష్టితో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు. పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. గత ఐదేళ్లు విధ్వంసం సృష్టించారని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. ఇక ఇప్పుడు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.