పీఠాధిపతి స్థానం కోసం పోటీ - సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు - clashs for Brahmamgari Peetam
🎬 Watch Now: Feature Video
Clashs Between Two Families for Brahmamgari Peetam in YSR District : వైఎస్సార్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి స్థానం కోసం రెండు కుటుంబాలు పోటీ పడుతున్నాయి. గతంలో పీఠాధిపతిగా ఉన్న వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి 2021లో కరోనాతో మృతి చెందారు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆ ఇద్దరు భార్యలు, వారి కుమారులు అప్పటి నుంచి పిఠాధిపతి స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఈ విషయంపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మొదటి భార్య కుమారులు తమను బెదిరిస్తున్నారుని రెండో భార్య మహాలక్ష్మి, ఆమె బావ శ్రీనివాసులు తెలిపారు. ఈ విషయంపై ఈ రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ, మెుదటి భార్య పిల్లలైన వెంకటాద్రి స్వామితో పాటు మరికొంతమంది రెండో భార్యను మఠం నుంచి శాశ్వతంగా బయటికి పంపించాలని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దీనికోసం తమను నానారకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై రెండేళ్ల కిందట హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. అయితే ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుండగానే మెుదటి భార్య పిల్లలు తమపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని శ్రీనివాసులు వాపోయారు. పోలీసులు స్పందించి తగు చర్యలు తీసుకొని వారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు.